వ్యవసాయ మార్కెట్లలో ఇసుక విక్రయం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వ్యవసాయ మార్కెట్లలో ఇసుక విక్రయం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ దాటించాల్సిందే
  • ప్రతి నెలా స్టేటస్ రిపోర్ట్ కేబినెట్ సబ్ కమిటీకి అందచేయండి
  • రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం

హైదరాబాద్, వెలుగు:సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో విక్రయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సిటీలో కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు దాటించాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వేగంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు.

శనివారం ప్రజాభవన్ లో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ సమావేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరిగింది. మంత్రులు ఉత్తమ్​కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇసుక క్వారీలకు సంబంధించి ఐటీడీఏలతో త్వరగా అగ్రిమెంట్లు చేసుకోవాలని మంత్రులు సూచించారు.

ఆదాయం ఆర్జించే శాఖల్లో లూప్ హోల్స్ అరికట్టాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధికారులు సాధించాలని మంత్రులు సూచించారు. 2025–-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకునే లక్ష్యాలు వాస్తవానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేబినెట్ సబ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు, వాటి పురోగతిని ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు ప్రతినెలా సమీక్షించాలని, ఆ ప్రోగ్రెస్​ రిపోర్ట్​ను ప్రతి మూడు నెలలకోసారి కేబినెట్ సబ్ కమిటీకి అందించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున అందుకు అవసరమైన ఆదాయ వనరులు పెంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎంఏ రిజ్వి, ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ సురేంద్రమోహన్, రిజిస్ట్రేషన్ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఇండస్ట్రీస్ కమిషనర్ విష్ణువర్ధన్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం, కమర్షియల్ టాక్స్ కమిషనర్ హరిత పాల్గొన్నారు.

సంపద, వనరులు అందని వర్గాలేవో గుర్తించండి

కులగణన సర్వే సమాచారాన్ని సంపూర్ణంగా స్టడీ చేయాలని స్వతంత్ర, మేధావుల కమిటీని భట్టి కోరారు. సర్వే సమాచారం మేరకు ఏ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా తరతరాలుగా వెనుకబడి ఉన్నాయో, రాష్ట్ర వనరులు పొంద కుండా ఉన్నాయో విశ్లేషణ చేసి నెల రోజుల వ్యవధిలో రిపోర్టు ఇవ్వాలని సూచించారు.

సర్వేను స్టడీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల జస్టిస్ సుదర్శన్ రెడ్డి చైర్మన్​గా, ప్రొఫెసర్ కంచ ఐలయ్య వైస్ చైర్మన్ గా, ప్రవీణ్ చక్రవర్తి కన్వీనర్​గా, ప్రొఫెసర్ సుఖదేవు తోరట్, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, ప్రొఫెసర్ శాంత సిన్హా, ప్రొఫెసర్ హిమాన్షు, ప్రొఫెసర్ భూ